newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

08-05-202108-05-2021 08:45:59 IST
2021-05-08T03:15:59.977Z08-05-2021 2021-05-08T03:15:55.546Z - - 22-06-2021

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అంత‌కు మించే వ‌చ్చు. అదేనండీ. హిందీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాడు నానీ. ఏం సంగ‌తి నానీ.. ఏం న‌డుస్తోంది అంటే.. ఏం లేదు.. ఓ మూడు సినిమాలు చేస్తున్నా. ట‌క్కేసుకుని రిలీజ్ కి రెడీ అయితే.. ఈ దిక్కు మాలిన క‌రోనా మ‌ళ్లీ వ‌చ్చి చ‌చ్చింది క‌దా. రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదాయే అంటున్నాడు. అది స‌రే కానీ.. ఈ ఖానా ఖాతాహై.. పానీ పీతే హై క‌తేంది అంటే. ఏం లేదులే.. అది హిందీ భాష గురించి అంటూ వివ‌రిస్తున్నాడు.

విష‌యం ఏంద‌య్యా అంటే.  నానికి బాలీవుడ్ సినిమాలు చేయాలి అని ఫుల్ గా ఉందంట‌. ఏ ఆర్టిస్ట్ కి అయినా అన్ని లాంగ్వేజుల్లో చేయాలి అని ఉంటుంది క‌దా. అలాగే నానీకి కూడా ఉందంట‌. ఎప్పుడెప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేద్దామా అని ఆలోచిస్తున్నాడ‌ట‌. కానీ.. నాకు హిందీ వ‌చ్చి చావ‌దే అంటున్నాడు. అదేంటీ అస్స‌లు రాదా హిందీ అంటే. మ‌రీ ఖానా ఖాతాహై.. పానీ పీతే హై లా కాకుండా కాస్త బానే వ‌చ్చు అంటున్నాడు. మ‌రి ఇంకేంటి. అస్స‌లు తెలుగు రాకుండా.. అంద్ర‌కీ న‌మ‌స్కారం అనే ఒక్క మాట‌నే ముక్క‌లు ముక్క‌లుగా  న‌రికే ఎంతోమంది బాలీవుడ్ బేబీలు.. మ‌న తెలుగులో స్టార్ హీరోయిన్ లు అయిపోతున్నారు. మ‌రి నీకేంటి స‌మ‌స్య అంటే....

నాకు అలా కాదు. హిందీ ఫుల్లుగా రావాలి. ఆ మాట‌ల్లోని మాధుర్యం అర్దం కావాలి. అది హార్ట్ లోకి  వెళ్లాలి. అప్పుడు నా న్యాచుర‌ల్ స్టార్ అనే స్టార్ డ‌మ్ కి అక్క‌డి స్టార్లు వ్యాల్యూ ఇస్తారు. లేదంటే సినిమా చేయ‌ను అంటున్నాడు నాని. మ‌రి 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమా తీసిన మీ దోస్త్ ప్ర‌దీప్ ని అడిగి..  30 రోజుల్లో హిందీ నేర్చుకోవ‌డం ఎలా అనే ఓ పుస్త‌కం కొనివ్వ‌మ‌ని చెప్ప‌కపోయావా అంటే.. అలా కాదు. నా ద‌గ్గ‌రికి స్టోరీలు రావాలి. వాటిలో ఏదైనా స్టోరీ నాకు పిచ్చెక్కించాలి.  ఈ సినిమా చేయ‌డానికి అర్జంట్ గా హిందీ నేర్చుకోవాలి అనే ఫీలింగ్ క‌ల‌గాలి. అప్ప‌టి దాకా.. హిందీ జోలికి పోనూ అంటున్నాడు. మ‌నం మాత్రం ఏం అంటాం.. స‌రె స‌రెలే.. అనుకున్న‌వ‌న్నీ అవుతాయా ఏంటి అనే డైలాగ్ నీకు కూడా గుర్తొస్తుంది.. అప్పుడు ఏదో ఒక సినిమా చేస్తావ్ లే అని మ‌నసులో అనుకోవ‌డం త‌ప్ప అంటున్నారు సినిమా ల‌వ‌ర్స్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle