newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఎపి ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలిపిన తమ్మారెడ్డి భరద్వాజ

13-01-202213-01-2022 09:30:45 IST
2022-01-13T04:00:45.583Z13-01-2022 2022-01-13T03:53:55.963Z - - 24-01-2022

ఎపి ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలిపిన తమ్మారెడ్డి భరద్వాజ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు విషయంలో ఎపి ప్రభుత్వం నిర్ణయానికి ప్రముఖ దర్శక  నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉన్నట్లే.. టికెట్‌ ధరలు తగ్గించుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హక్కు ఉంటుంది అని థియేటర్స్‌కు బీ ఫామ్‌ అనేది ఒకటి ఉంది. ఆ ప్రకారం రేట్లు ఉంటాయి. తప్పా.. ఒప్పా అనేది తర్వాత విషయం. కానీ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్‌. అది చట్టపరంగా వారికి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు. అయితే థియేటర్స్‌ వారికి కూడా రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉంటాయి. కానీ చట్టపరంగా వాటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 

లీగల్‌గా తెచ్చుకునే వరకూ హక్కు లేదు. ఈ విషయాన్ని వివాదం చేయడం కంటే పరిష్కరించుకోవడం మంచిది. ఎవరిపైనా ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదు. ఏపీలో టికెట్‌ ధరల గురించి చాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ నుంచి రిక్వెస్ట్‌ చేశాం. ఇటీవల మీటింగ్‌ జరిగిందని తెలిసింది. త్వరలో మరో మీటింగ్‌ జరిగి, ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది. ఇక తమిళనాడు, కర్ణాటక, ముంబై వంటి రాష్ట్రాల్లో థియేటర్స్‌లో ఫిఫ్టీ పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఉండటం, మరికొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్‌ క్లోజ్‌ చేసి ఉండటం, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు వంటి కారాణాల చేతనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’,‘రాధేశ్యామ్‌’ వాయిదా పడ్డాయి. ఈ విషయంలో ఏపీలోని టికెట్‌ ధరల ప్రభావం కేవలం ఒక శాతం మాత్రమే అని తమ్మారెడ్డి భరద్వాజ  అన్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle