అభిమానులకి లేఖ వ్రాసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
08-05-202208-05-2022 07:16:13 IST
2022-05-08T01:46:13.366Z08-05-2022 2022-05-08T01:43:53.787Z - - 27-05-2022

సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసారు. 'ప్రియమైన అభిమాన మిత్రులకు' అని సంబోధించిన అగ్ర హీరో.. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసి స్పందన తెలియజేయాలని కోరారు. మహేష్ బాబు రాసిన లేఖలో ''ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - జి.యమ్. బి. ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ - యలమంచిలి రవి శంకర్ - ఆచంట రామ్ - ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తయి.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై.. రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన 'సర్కారు వారి పాట' చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చిన్న బాబు) నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు కాగలదు. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి'' అని మహేష్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తమ అభిమాన హీరో తమని ఉద్దేశిస్తూ ఇలా ఓపెన్ లెటర్ విడుదల చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - నదియా - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణమురళి - మహేష్ మంజ్రేకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆర్ మదే సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా