newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వకీల్ సాబ్ అతడిని ఎంతగానో ఇబ్బంది పెట్టాడట.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

04-05-202104-05-2021 08:06:21 IST
2021-05-04T02:36:21.417Z04-05-2021 2021-05-04T02:35:54.574Z - - 14-05-2021

వకీల్ సాబ్ అతడిని ఎంతగానో ఇబ్బంది పెట్టాడట.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంటూ ఉంది.  వకీల్ సాబ్ 'అమెజాన్ ప్రైమ్' లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. ఈ సినిమా ఓటీటీలో 50 రోజుల తర్వాతనే వస్తుందని గతంలో దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ ఊహించిన డేట్ కంటే ముందే ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఇది కూడా ఆయనకు లాభాన్నే తీసుకుని వచ్చిందని అంటున్నారు.  ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. వకీల్ సాబ్ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం కావడం, కేసులు పెరగడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో నిర్మాత దిల్ రాజు ఓటీటీ ఎర్లీ రిలీజ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఈ ముందస్తు విడుదల ద్వారా నిర్మాతకు రూ.12 కోట్ల వరకు అదనపు లాభం వచ్చినట్లు తెలుస్తోంది. 

వకీల్‌సాబ్ సినిమాపై సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సినిమాలోని ఓ సన్నివేశంలో తన అనుమతి లేకుండా తన ఫోన్ నంబరును వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నటిని అసభ్యకరంగా మార్చినట్టు ఉన్న ఫొటోల కింద తన ఫోన్ నంబరు ఉందని, దీంతో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రోజూ ఫోన్లు వస్తున్నాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫోన్ చేసిన వారు తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అన్నాడు. తన ఫోన్ నంబరును వాడుకున్నందుకు సినిమా యూనిట్‌పై కేసు నమోదు చేయాలని కోరాడు. పోలీసులు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. వకీల్ సాబ్ సినిమాలో అంజలి పాత్రను వేధించే సమయంలో ఓ ఫోన్ నెంబర్ ను ఉపయోగించారు. ఆ ఫోన్ నంబర్ సుధాకర్ అనే వ్యక్తిది కావడంతో పాపం ఇప్పుడు ఆయన చిక్కులు పడ్డారు. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   11 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle