newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మురిపించే అందం... శ్రీ శ్రీ సినీ సౌరభం

30-04-202130-04-2021 13:30:53 IST
Updated On 01-05-2021 07:22:01 ISTUpdated On 01-05-20212021-04-30T08:00:53.828Z30-04-2021 2021-04-30T07:53:14.130Z - 2021-05-01T01:52:01.561Z - 01-05-2021

మురిపించే అందం... శ్రీ శ్రీ సినీ సౌరభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు సాహిత్యంపై చెదరని, చెరగని సంతకం శ్రీ శ్రీ. నిరంతర ప్రవాహంలా అనునిత్య సముద్ర కెరటంలా హృదయ తీరాలను తాకుతూనే ఉంటుంది ఆయన కవితా ఝరి. సామాజిక దురంతాలను ఎండగట్టిన పదును ఆయన కలంలో ఉంది. అనిర్వచనీయమైన భావ గాఢతా లోతులను సృషించే కమనీయ భావ సంపద ఆయనకు ఉంది. తెలుగు సాహిత్యంలో మేరునగం సినీ కళామతల్లికి  కంఠాభరణం ఆయన సినీగీతాహారం. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ కి ముందు తరువాత అన్నట్లుగా సినీ సాహిత్యంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు.

చరణంలో చెళుకులను, పల్లవిలో పదునుతో సాగిన ఆయన తెలుగు సినీ పాటల పరంపర అభ్యుదయ భావ గీతికే.  ఇటు ప్రాసను అటు శ్లేషను అవపోసన పట్టిన శ్రీ శ్రీ ఎన్నో సినీ సుగంధాలను ప్రేక్షుకులకు అందించారు. ఆయన రాసిన ఏ పాట  తీసుకున్నా తెలుగుదనంలోని మెరుపు కనిపిస్తుంది. ఆత్మీయత, అనురాగం అన్న భావనలకు నిలువెత్తు నిదర్శనంలా ఆయన సినీ సాహిత్యం హృదయతంత్రులు మీటుతుంది. ' పదండి ముందుకు పదండి తోసుకు' అంటూ తెలుగు సాహిత్యంలో జాజ్వల్యమానంగా ప్రకాశించిన శ్రీ శ్రీ సినీ సాహిత్యంలో ఆ పదునును కనబరిచారు.

ఆంగ్లేయుల గుండెల్లో పెనుమంటలు రేకెత్తించిన సీతారామరాజు నోట పలికిన శ్రీ శ్రీ పాట ఓ అభ్యదయ గీతిక. ప్రతి ఒక్కరిలోనూ పౌరుషాగ్ని రగిలించిన ఓ కంచు కాగడా. 'తెలుగువీర లేవరా' అంటూ సాగే ఆ పాట తెలుగువాడి స్ఫూర్తికి, పోరాట పటిమకు తిరుగులేని స్వాతంత్య్ర  కాంక్షకు అద్దం పట్టింది. పెను నిద్ర నుంచి లేపి స్వాతంత్య్ర సమరానికి ఉరకలెత్తించింది. దాన్ని పాట అనేకంటే తెలుగువారికి శ్రీ శ్రీ అందించిన మేలుకొలుపు గీతమంటేనే సమంజసంగా ఉంటుంది. సమ భావనలు, సమతానురాగాలు కూడా శ్రీ శ్రీ పాటల్లో అద్భుతంగా మేళవించాయి.

'సంగమం, సంగమం' అంటూ కోడెనాగులో ఆయన రాసిన పాట అభ్యుదయ భావనల మూటే. భావ రాగ తాళ మాధుర్యాలను ఈ సంగమ జీవనంలో మేళవించిన శ్రీ శ్రీ ఆ పాటను అజరామరం చేశారు. భావం ఏదైనా భావోద్వేగాలు ఆయన పదాల్లో పరుగులు పెడతాయి. మానవ జీవనం సమతా సమ భావనల సంగమమే. ఆ భారతీయుడి హృదయ గీతికను పాడవోయి భారతీయుడా అంటూ ఎలుగెత్తి చాటారు. ప్రేమ, ఆరాధనా, ఆత్మీయత,  ఆప్యాయత శ్రీ శ్రీ కలంలో కొత్త సొబగులు అద్దుకున్నాయి. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో 'మనసున మనసై' అంటూ సాగే ఆ పాట ఆరాధనా భావానికి, ఆత్మీయ జీవన సుగంధానికి ఓ చిరునామా.

అలాగే  ' నా హృదయంలో నిదురించే చెలి' అంటూ కూరా ఓ ప్రేమికుడి హృదయపు లోతులను తన పద సంపదతో భావ గాఢతతో ఆవిష్కరించారు. 'హలొ హలొ ఓ అమ్మాయి' అంటూ ఆటపట్టించే పాటలను ఎంత అలవోకగా రాశారో మురిపించే అందాలే అవి నన్నే చెందాలే  అంటూ ఆరాధనా భావాన్ని అమలిన రీతిలో అందించారు. ఒక పాటైనా, ఒక మాటైనా శ్రీ శ్రీ సిరా పడితే అది శిలాక్షరమే. సినిమా పాటకు జవజీవాలు అందించి పరుగును, పదునును పెట్టిన శ్రీ శ్రీ సినీ జగత్తుకు కూడా చెరగని ముద్ర.   

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   10 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle