newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

సిక్కెంటికెల గడుసు పోరి వెబ్ సిరీస్ ప్రారంభం..

14-09-202114-09-2021 22:29:58 IST
Updated On 14-09-2021 22:34:24 ISTUpdated On 14-09-20212021-09-14T16:59:58.366Z14-09-2021 2021-09-14T16:59:53.541Z - 2021-09-14T17:04:24.978Z - 14-09-2021

సిక్కెంటికెల గడుసు పోరి వెబ్ సిరీస్ ప్రారంభం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నో మరుగున పడిపోయిన సంప్రదాయ వృత్తులలో ఒకటి సిక్కెంటికెలు సేకరించే వ్రుత్తి. ఒకప్పుడు తెలంగాణ లో గ్రామ గ్రామాన సిక్కెంటికెలు సేకరించి దానికి ప్రతిగా స్టీలు గిన్నెలు అందిస్తూ తిరిగే వారు చాలా మంది ఉండే వారు. సిక్కెంటికెలని సేకరించి వాటిని అమ్ముకుంటూ తమ కుటుంభాన్ని పోషించుకునే వారు ఎందరో కనిపించేవారు. వీరి జీవన శైలి ఎలా వుండేది, సిక్కెంటికెలు సేకరించడానికి గ్రామాలకి వెళ్ళే వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యేవి అన్న కథాంశంతో హాస్య్త ప్రధానంగా రూపొందిస్తున్న వెబ్ సిరీస్ సిక్కెంటికెల గడుసు పోరి. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొత్త జాల గ్రామంలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కొత్త జాల గ్రామ సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్ సింగ్ మాట్లాడుతూ ఒకప్పుడు పల్లెటూరు జీవన విధానం ఎలా ఉండేదో తెలియజెప్పే మంచి కథాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఘన విజయం సాధిస్తుందని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందే ఇలాంటి కథనాలతో మరిన్ని వెబ్ సిరీస్ లు రావాలని, ఇప్పటి జనరేషన్ కి ఇలాంటి కథలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని, ఇటువంటి కథా వస్తువులతో రూపొందే చిత్రాలని తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారని సర్పంచ్ అన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. విలేజ్ డెవలపర్ చానెల్ సమర్పించు ఈ వెబ్ సిరీస్ లో టిక్ టాక్ ఫేం రాజేష్, భాస్కర్ తరిగొప్పుల, లయ మౌని, లావణ్య, బేబీ రిక్విత, అఖిల శివకుమార్, జె. నర్సయ్య, కోడి శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ కి కెమరా జీవన్ భట్టు, స్క్రిప్ట్ నీల మహేష్, నిర్మాత రావుల శేఖర్. కథ, మాటలు, చెడుదీపు సంతోష్ కృష్ణ, దర్శకత్వం భాస్కర్ తరిగొప్పుల.

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   5 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   9 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   21-09-2021


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle