newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

13-10-202113-10-2021 11:58:43 IST
2021-10-13T06:28:43.149Z13-10-2021 2021-10-13T06:28:36.725Z - - 17-10-2021

తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సంస్కృతి ని, పల్లె వాతావరణాన్ని, తెలంగాణ యాస ని ప్రపంచానికి తెలియచెప్పేలా లఘు చిత్రాలు, వెబ్ సిరీస్ లు రావాలని శిక్కేంటికెల పోరీ వెబ్ సిరీస్ పోస్టర్ విడుదల సందర్భంగా పలువురు అభిప్రాయ పడ్డారు. విలేజ్ డెవలపర్స్ ఛానల్ సమర్పిస్తున్న శిక్కేంటికల పోరీ వెబ్ సిరీస్ పోస్టర్ విడుదల కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలం కొత్త జాల గ్రామంలో అట్టహాసంగా జరిగింది. గ్రామ సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్ సింగ్ పోస్టర్ ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్న వృత్తుల గురించి నేటి తరానికి పరిచయం చేయాలన్న దర్శకుడి ఆలోచన అభినందించదగినదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన శిక్కేంటికల పోరి యూనిట్ ని అభినందించారు. నరసాపురం గ్రామ సర్పంచ్ నాగిర్తి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ని, పల్లె వాతావరణాన్ని కళ్ళకు కట్టే విధంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మొల్లగూడెం సర్పంచ్ రాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తున్న మౌని పుట్టినరోజు సందర్భంగా వెబ్ సిరీస్ యూనిట్ ఆమె చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ శిక్కేంటికల పోరీ వెబ్ సిరీస్ లో నటీనటులు గా భాస్కర్, మౌని, లావణ్య, బేబీ, టిక్ టాక్ రాజేష్, శివ తదితరులు నటించారు. కెమెరా జీవన్ భట్టు, రచన సంతోష్ కృష్ణ, నీల మహేష్, సంగీతం పూర్ణ చందర్, దర్శకత్వం భాస్కర్ సూర్య.

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

   31 minutes ago


స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

   4 hours ago


‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

   a day ago


బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

   16-10-2021


రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

   14-10-2021


ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

   14-10-2021


మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

   14-10-2021


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

   13-10-2021


పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

   12-10-2021


ప్రకాష్ రాజ్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

ప్రకాష్ రాజ్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. ఖండించిన బండ్ల గణేష్

   12-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle