newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

24-07-202124-07-2021 08:19:40 IST
2021-07-24T02:49:40.278Z24-07-2021 2021-07-24T02:49:35.812Z - - 22-09-2021

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోర్న్ చిత్రాల కేసులో బాలీవుడ్ హీరొయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. తన భర్త అరెస్ట్‌ అయిన తర్వాత ఇప్పటివరకు మాట్లాడని శిల్పాశెట్టి.. మొదటి సారి సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని కొటేషన్లని రాసుకుంటూ వచ్చింది. కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తును చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను శిల్పా హైలేట్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

అయితే రాజ్ కుంద్రా కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశారు. పోర్న్‌ వీడియోలను భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టినట్లు అతని వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా తెలుస్తుందని ముంబై పోలీసులు తెలిపారు. 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లకు డీల్‌ కుదుర్చుకున్నట్లు వాట్సాప్‌ చాట్‌లో కనుగొన్నామన్నారు. ఈ డీలింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని, ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం శిల్పాశెట్టి తన భర్తకి అండగా నిలిచి పోరాడుతుందా లేదంటే తన దారి తను చూసుకుంటుందా అన్న చర్చ బి టౌన్ లో జోరుగా సాగుతుంది. 

 

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   5 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   9 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   21-09-2021


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle