newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

సల్మాన్ ఖాన్ కి పెళ్ళయ్యింది.. ఒక కూతురు కూడా..

22-07-202122-07-2021 18:44:07 IST
2021-07-22T13:14:07.250Z22-07-2021 2021-07-22T13:14:04.050Z - - 25-07-2021

సల్మాన్ ఖాన్ కి పెళ్ళయ్యింది.. ఒక కూతురు కూడా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి పెల్లయ్యిందని, ఒక కూతురు కూడా వుందని, వీరు దుబాయ్ లో నివసిస్తున్నారని, అందుకే సల్మాన్ కూడా ఎక్కువగా దుబాయ్ వేలుతుంటాడని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తా ఈ చెవిన, ఆ చెవిన చేరి చివరకి సల్మాన్ ఖాన్ చెవి లో కూడా పడింది. ఈ విషయంపై సల్మాన్ స్పందించాడు. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ తాజాగా ఓ సెలబ్రిటీ రియాల్టీ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్లు.. దానిపై వారి స్పందన గురించి ఈ షోలో చూపించనున్నారు. సల్మాన్ ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనపై సోషల్ మీడియా లో వచ్చే కామెంట్ల పై స్పందించాడు. 

తనపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్ల పై సల్లూబాయ్‌ స్పందించారు. ‘నా గురించి సోషల్‌మీడియాలో తరచూ ఎన్నో కామెంట్లు వస్తుంటాయి. కానీ, నేను వాటిని అంతగా పట్టించుకోను. నెగటివిటీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాజిటివ్‌గా జీవించలేం’ అని సల్మాన్‌ తెలిపారు. అనంతరం ఓ నెటిజన్.. ‘సల్మాన్‌ ఇంకా ఎంతకాలం దాస్తావ్‌? నీకు పెళ్లైందని.. 17 ఏళ్లు వయసున్న అమ్మాయి కూడా ఉందని మాకు తెలుసు. వాళ్లిద్దర్నీ దుబాయ్‌లో ఉంచావ్‌ కదా?’ అని కామెంట్‌ చేయగా.. ‘ఈ నెటిజన్‌ ఎవరో కానీ అన్ని తెలిసినట్లే మాట్లాడుతున్నాడు. కానీ, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. భారతదేశం మొత్తానికి తెలుసు నాకు పెళ్లి కాలేదని.. భార్యాపిల్లలు నా జీవితంలో లేరని.. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ముంబయిలోనే ఉంటున్నానని.. మరలా ఈ నెటిజన్‌ ట్వీట్‌పై స్పందించాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. అయితే ఎలాంటి కామెంట్స్ వల్ల తాను స్పందించి వారిని ఇంకా హైలట్ చేయడం తనకిష్టం లేదని తెలిపాడు. అవును మరి సెలబ్రిటీల పై ఎదో మాట్లాడి, దానికి వారు రిప్లై ఇస్తే ఆ కామెంట్ చేసిన వారు కూడా సెలబ్రిటీలు అయిపోతారు మరి. సోషల్ మీడియా అంటేనే అది కదా.. సామాన్యుడిని రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేస్తుంది. సెలబ్రిటీని రాత్రికి రాత్రే సామాన్యుడిని చేస్తుంది మరి.

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   13 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   13 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   24-07-2021


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle