newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

14-05-202114-05-2021 14:34:49 IST
Updated On 14-05-2021 09:35:19 ISTUpdated On 14-05-20212021-05-14T09:04:49.818Z14-05-2021 2021-05-14T03:07:52.042Z - 2021-05-14T04:05:19.425Z - 14-05-2021

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమా 'రాధే.. ది మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పటానీ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లోనూ.. జీ ప్లెక్స్ లోనూ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా చూసినోళ్లు ఎంతో చెత్తగా ఉంది అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రభుదేవా దయచేసి దర్శకత్వం వదిలేయాలని.. లేదంటే సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీయడం మానేయాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

కొంచెం కూడా కొత్తగా సినిమా లేకపోవడం.. రీమేక్ అయినా కూడా ఎంతో చెత్తగా తీయడం వంటి మైనస్ పాయింట్లు సినిమాను వెంటాడాయి. కేవలం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు అయినా నచ్చుతుందో లేదో కూడా తెలియని కథతో సినిమాను నడిపించారు. కామెడీ సీన్స్ అని చెప్పుకున్నా కూడా ఏ మాత్రం నవ్వు తెప్పించలేదు సరి కదా.. విసుగు పుట్టించింది. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయని అనిపించినా.. ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీ, క్లైమాక్స్ చాలా ఓవర్ గా ఉన్నాయనే చెబుతున్నారు. 

రాధే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓటీటీ వేదిక జీ5, జీ5 ప్లస్‌లో విడుదలైంది. సినిమా విడుదల సమయం అవగానే అందరూ ఒకేసారి లాగిన్‌ అయ్యారు. దీంతో సర్వర్లన్నీ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. ఈ విషయాన్ని జీ5 వారు పరోక్షంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు. సమస్యను పరిష్కరించి త్వరలోనే మీ ముందుకు వస్తామని వెల్లడించారు. అందరికీ ఈ సమస్య తలెత్తలేదని సమాచారం. కొందరు మాత్రం చిత్రాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. యాప్ సరిగా లేదని విమర్శించారు.

ఐపీఎల్ మ్యాచ్ ను ఏకంగా 10-20 మిలియన్ల మంది చూస్తూ ఉంటారని.. సల్మాన్ ఖాన్ సినిమాను 1-2 మిలియన్ల మంది చూడడానికి లాగిన్ అయ్యుంటారని.. అలాంటప్పుడు జీ సర్వర్లలో సమస్యలు ఉంటాయని.. అంతే తప్ప భాయ్ సినిమాకు అంత డిమాండ్ అయితే ఏమీ లేదని అన్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఉండి ఉంటే ఫ్లాప్ టాక్ నే అందుకునేది..! ఓటీటీలో విడుదలవ్వడం వల్ల ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వరుస ఫ్లాపులు సల్మాన్ ఖాన్ ను పలకరిస్తూనే ఉన్నాయి. కొంచెం అయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో రాధేను విమర్శిస్తూ చెప్పారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle