newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

రావణాసుర షూటింగ్ ప్రారంభం

15-01-202215-01-2022 07:44:33 IST
2022-01-15T02:14:33.205Z15-01-2022 2022-01-15T02:14:30.548Z - - 24-01-2022

రావణాసుర షూటింగ్ ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర షూటింగ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభం  అయింది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు కేయస్‌ రవీంద్ర (బాబీ), గోపీచంద్‌ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సుశాంత్‌ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్‌ కార్తీక్‌ కన్నన్.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle