newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌

20-07-202120-07-2021 18:21:00 IST
2021-07-20T12:51:00.011Z20-07-2021 2021-07-20T12:41:45.521Z - - 25-07-2021

విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రామ్ గోపాల్ వ‌ర్మ‌ ట్వీట్ చేశాడంటే అది ఏ విషయం పైన అయినా నెగెటివ్ గానే ఉంటుంది. ఇక అతనికి ఏదైనా నచ్చితే మాత్రం దానికి అతిశయోక్తులన్నీ జోడించి మరీ ఆకాశానికి ఎత్తేస్తాడు. తాజాగా ఆయన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాద్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ర‌షెస్ ఏవో చూశాడ‌ట వ‌ర్మ‌. ఇక దాని గురించి పొగ‌డ్త‌లు మామూలుగా లేవు. లైగ‌ర్ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే.. గ‌త రెండు ద‌శాబ్దాల్లో మ‌రే స్టార్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ అలా లేద‌ని ట్వీట్ చేశాడు. 

ఇక ఇందులో కొన్ని సీన్లు చూస్తే.. విజ‌య్ సింహానికి, పులికి క్రాస్ చేస్తే వ‌చ్చిన దానికంటే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ర‌వితేజ‌, టైగ‌ర్ ష్రాఫ్‌ల‌ను క్రాస్ చేస్తే ఎలా ఉంటాడో అలా క‌నిపించాడ‌ని.. ఇలాంటి సినిమాను రూపొందించిన పూరికి, నిర్మించిన ఛార్మికి చాలా థ్యాంక్స్ అని ఒక రేంజిలో పొగిడేశాడు వ‌ర్మ‌. అయితే గతంలో పూరి తీసిన లోఫ‌ర్ అనే అట్ట‌ర్ ఫ్లాప్ మూవీ గురించి వ‌ర్మ ఇలాగే అద్భుతంగా ఉందంటూ, త‌న జీవితంలో అలాంటి మ‌ద‌ర్ సెంటిమెంట్ మూవీనే చూడలేద‌ని ఆ చిత్రం పై హైప్ క్రియేట్ అయ్యేలా ట్వీట్ లు వేసాడు. కానీ ఆ సినిమా లో అంత సీన్ లేదని తేలిపోయింది. మరి ఈ సినిమాని కూడా ఇంతలా పొగుడుతున్నాదంటే కొంపదీసి లోఫర్ లగే లైగర్ కూడా పరాజయం పాలవుతుందా అన్న భయం విజయ్ అభిమానులకి కలుగుతోంది. 

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   12 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   12 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   24-07-2021


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle