newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

రామ్‌ చరణ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా

09-06-202109-06-2021 19:27:17 IST
2021-06-09T13:57:17.506Z09-06-2021 2021-06-09T13:57:14.441Z - - 22-06-2021

రామ్‌ చరణ్‌ - లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో సినిమా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎంత టాలెంట్ కలిగిన డైరెక్టర్ అయినా సక్సెస్ ఉంటేనే అవకాశాలు పరుగెత్తుకుంటూ వస్తాయి సినిమా ఇండస్ట్రీలో. వరుసగా రెండు చిత్రాలు సూపర్ హిట్ అయితే ఇక ఆ దర్శకుడి వెనకాల నిర్మాతలు క్యూ కడతారు. ఎందుకంటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో కలిసి పని చేయడానికి స్టార్ హీరోలు సైతం ఇంటరెస్ట్ చూపిస్తారు కాబట్టి. ఇక తమిళంలో కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో సూపర్‌ క్రేజ్‌ సంపాదించుకున్నలోకేష్‌ కనగరాజు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో వెంటనే మరో స్టార్ హీరో ఇలయ దలపతి విజయ్‌తో మాస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా లోకేష్‌ కనగరాజు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ తో తెలుగు, తమిళం ద్విభాషా చిత్రానికి రెడీ అయ్యారని. ఆల్రెడీ కథ కూడా విన్న రామ్‌చరణ్‌ ఈ సినిమా పై ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ తో బిజీగా వున్న రామ్‌ చరణ్‌ తన తదుపరి చిత్రాన్ని లోకేష్‌ కనగరాజు తోనే ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాను దర్శకత్వం వహించిన రెండు చిత్రాలలోనూ స్టార్ హీరోలు నటించినప్పటికీ కథ కి తగ్గట్టుగానే సినిమా రూపొందించి సక్సెస్ సాధించాడు. మరి లోకేశ్‌ కనగరాజ్‌ రామ్‌చరణ్‌ తో తీయబోయే స్టోరీ లైన్ ఏమిటో తెలియనప్పటికీ వీరి కాంబినేషన్ లో రూపొందే చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని ఫిలిం నగర్ టాక్.


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle