newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

'హీరో' మూవీ ట్రైలర్ ని విడుదల చేసిన దర్శకదీరుడు రాజమౌళి

11-01-202211-01-2022 08:05:49 IST
Updated On 11-01-2022 08:06:55 ISTUpdated On 11-01-20222022-01-11T02:35:49.067Z11-01-2022 2022-01-11T02:35:40.780Z - 2022-01-11T02:36:55.014Z - 11-01-2022

'హీరో' మూవీ ట్రైలర్ ని విడుదల చేసిన దర్శకదీరుడు రాజమౌళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''హీరో'' సినిమా ట్రైలర్ ను దర్శకధీరుడు రాజమౌళి ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 'పక్కా పండుగ సినిమా' అంటూ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. ఇప్పటికే ప్రచార చిత్రాలు - ఫస్ట్ సింగిల్ - టీజర్ లతో సోషల్ మీడియాలో సందడి చేసారు. 'కలల్లో బిర్యానీ వండుకుంటే రియాలిటీలో కడుపు నిండదురా.. రియాలిటీలోకి రా..' అని నరేశ్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సినిమా హీరో కావాలని కలలు కనే నేటి తరం కుర్రాడి పాత్రలో అశోక్ కనిపిస్తున్నాడు. దీనికి అతని తల్లి సైడ్ నుంచి సపోర్ట్ లభిస్తుండగా.. తండ్రి (నరేష్) మరియు ప్రేయసి ఫాదర్ (జగపతి బాబు) మాత్రం ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'హీరో' సినిమాలో అశోక్ డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. అందులో కౌబాయ్ మరియు జోకర్ గెటప్స్ రెండూ ప్రత్యేకంగా నిలుస్తాయని తెలుస్తోంది. ట్రైలర్ లో అశోక్ ఎనర్జిటిక్ గా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో పాటుగా కామెడీ మరియు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ను ట్రైలర్ లో చూపించారు. ఇందులో వెన్నెల కిశోర్ - బ్రహ్మాజీ - కోట శ్రీనివాస్ - సత్య - అర్చన సౌందర్య - కౌశల్య - మైమ్ గోపి - అజయ్ ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 'క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథలు చెప్పరు' అని అశోక్ చెప్పడంతో ట్రైలర్ ముగిస్తుంది. కృష్ణ మరియు గల్లా అరుణకుమారి సమర్పణలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle