'అన్ స్టాపబుల్' గ్రాండ్ ఫినాలేలో ప్రిన్స్ మహేష్ బాబు
21-01-202221-01-2022 22:44:31 IST
2022-01-21T17:14:31.671Z21-01-2022 2022-01-21T17:14:28.356Z - - 27-05-2022

నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమం మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకోగా.. సీజన్-1 ఫినాలే ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యెక అతిధిగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ‘ఆహా’ టీమ్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలయ్య - మహేష్ బాబుల మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ చూడటానికి సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ని ఫిబ్రవరి 4వ తేదీన ప్రీమియర్ గా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు తాజాగా మహేష్ పాల్గొన్న 'అన్ స్టాపబుల్' ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. 'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అతనే మహేష్..' అంటూ బాలయ్య తనదైన శైలిలో సూపర్ స్టార్ ని ఆహ్వానించారు. ఇందులో బాలకృష్ణ - మహేష్ మధ్యన సాగిన సరదా సంభాషణ నవ్వులు పూయిస్తోంది. మహేష్ తన భార్యా పిల్లల గురించి చెప్పడమే కాదు.. తన కామెడీ టైమింగ్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రోగ్రామ్ లో మొత్తం బయటకు లాగుతానని బాలయ్య అనడం అందరిని నవ్విస్తోంది. కేబీఆర్ పార్కుకు వాకింగ్ వెళ్తే పాము కనిపించదని.. అప్పటి నుంచి మళ్లీ అటు వైపు వెళ్లలేదని మహేశ్ బాబు అప్పట్లో జరిగిన ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అలానే 1000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించడం వెనకున్న కారణాన్ని చెప్పి మహేష్ భావోద్వేగానికి గురి చేశారు. తన కుమారుడు గౌతమ్ కృష్ణ పుట్టినప్పుడు కేవలం అరచేయి అంత మాత్రమే ఉన్నాడని మహేష్ తెలిపారు. తనకు డబ్బు ఉండటం వల్ల వైద్యం చేయించుకున్నామని.. కానీ లేని వాళ్ల పరిస్థితి ఏంటనిపించిందని.. అందుకే చిన్నారుల హార్ట్ ఆపరేషన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ షోకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా అతిథిగా హాజరయ్యారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికరమైన ఈ సంభాషణ ఫిబ్రవరి 4వ తేదీన 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా