newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

01-12-202101-12-2021 09:45:06 IST
2021-12-01T04:15:06.703Z01-12-2021 2021-12-01T04:15:01.740Z - - 24-01-2022

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించడానికి తరలి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పాటు, ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘తెలుగు అక్షరాలు 56. తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలం. అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి, ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగుజాతి గర్వపడేలా తన కలాన్ని కదిలించిన గీత రచయిత, సాహితీకారుడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తరపున ఘన నివాళి అర్పిస్తున్నాం. ‘సిరివెన్నెల’ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  మంత్రి పేర్ని నాని అన్నారు.

ఇక నిర్మాతలు డీవీవీ దానయ్య, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, సి.కల్యాణ్‌, ఎంఎస్‌ రాజు, సంగీత దర్శకులు కల్యాణ్‌ మాలిక్‌, దర్శకుడు నాగ్ అశ్విన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, రచయిత బుర్రా సాయిమాధవ్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, సీనియర్‌ నటుడు మురళీమోహన్‌, నటుడు వెంకటేష్, యువ నటులు రానా, నాని తదితరులు ‘సిరివెన్నెల’ భౌతికకాయానికి నివాళులర్పించి సిరివెన్నెల తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle