newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో అదృష్టం వరించింది వీరినే..!

26-04-202126-04-2021 13:29:47 IST
Updated On 26-04-2021 13:36:19 ISTUpdated On 26-04-20212021-04-26T07:59:47.958Z26-04-2021 2021-04-26T07:58:42.308Z - 2021-04-26T08:06:19.191Z - 26-04-2021

93వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో అదృష్టం వరించింది వీరినే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అవార్డుల వేడుకలలో 'నో మ్యాడ్‌ ల్యాండ్‌' సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఈ ఏడాది ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. కేవలం సెలబ్రెటీలు మాత్రమే ఇందులో పాల్గోన్నారు. కరోనా కారణంగా మొట్టమొదటిసారి రెండు ప్రాంతాల్లో ఆస్కార్స్ వేడుకను నిర్వహించారు. అటు డోల్బీ థియేటర్‌లో, మరోవైపు లాస్‌ఏంజెల్స్‌లో ఆస్కార్‌ 2021 అవార్డు విజేతలను ప్రకటించారు.

'నో మ్యాడ్‌ ల్యాండ్‌' సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించగా, ఇదే సినిమాకుగానూ క్లోవే జావోకు ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ వరించింది. అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ది ఫాదర్‌ చిత్రానికి అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌కు ఆస్కార్‌ వరించింది. ఉత్తమ సహాయ నటిగా యువాన్ యు జంగ్ (మినారి సినిమా)కు అవార్డు అందింది. దక్షిణ కొరియాలోనే ఆస్కార్ అందుకున్న తొలి నటిగా ఆమె రికార్డును అందుకుంది. ఇక ఉత్తమ రచయితగా క్రిస్ట్ ఫర్ హ్యాంప్టన్, ఫ్లోరియన్ జెల్లర్ లకు, ఉత్తమ సహాయ నటుడిగా డానియల్ కలూయలు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. 

ఆస్కార్‌ వరించింది ఎవరెవరికంటే...

ఉత్తమ చిత్రం:   నో మ్యాడ్‌ ల్యాండ్‌

ఉత్తమ నటుడు:   ఆంటోని హాప్‌కిన్స్‌ (ద ఫాదర్‌)

ఉత్తమ నటి:   ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌ (నో మ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ చిత్రం ఎడిటింగ్‌:   సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ దర్శకురాలు:   క్లోవే జావో‌ (నోమ్యాడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు:   డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మెస్సయా)

ఉత్తమ సహాయ నటి:   యువాన్‌ యు–జంగ్(మిన్నారి)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సినిమాటోగ్రఫి:  మ్యాంక్‌

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:   టెనెట్‌

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌:   కొలెట్‌

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌:   మ్యాంక్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌:   సోల్

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌:   ఫైట్‌ ఫర్‌ యూ (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య)

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌:   ఇఫ్‌ ఎనీథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:   అనదర్‌ రౌండ్‌ 

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌:   మై ఆక్టోపస్‌ టీచర్‌

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే:   ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే:   ది ఫాదర్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ:   మ్యాంక్‌

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌:   మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌:   మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌:   టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:   సోల్‌

 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   9 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   4 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle