newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య కామెంట్స్

11-06-202111-06-2021 08:20:50 IST
2021-06-11T02:50:50.095Z11-06-2021 2021-06-11T02:50:44.270Z - - 22-06-2021

మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ స్పందించారు. తన 61వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ "ఆదిత్య 369 సీక్వెల్‌లో అబ్బాయి, నేను కలిసి నటిస్తాం. తాతమ్మ కల వంటి పలు సినిమాల ద్వారా నాన్నగారు నాకు నటనలో మెళకువలు నేర్పించాడు. అలా నేను మోక్షజ్ఞను నా సినిమాతో పరిచయం చేస్తూ మెళకువలు నేర్పిస్తాను. ఈ సినిమాకు నేను లేదా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌ చేస్తారు అని బాలయ్య తెలిపారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఆదిత్య 369 చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తండ్రీ కొడుకులు నటిస్తుండడంతో ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. 

కాగా ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. సినిమా కూడా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle