newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

బాలయ్య బర్త్ డే గిఫ్ట్.. అఖండ పోస్టర్

10-06-202110-06-2021 08:04:24 IST
Updated On 10-06-2021 09:18:00 ISTUpdated On 10-06-20212021-06-10T02:34:24.404Z10-06-2021 2021-06-10T02:34:15.521Z - 2021-06-10T03:48:00.448Z - 10-06-2021

బాలయ్య బర్త్ డే గిఫ్ట్.. అఖండ పోస్టర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా అఖండ మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ లో బాలకృష్ణ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్ ఫుల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థం అవుతోంది. కొత్త పోస్టర్‌ విడుదలతో ఒక్క రోజు ముందే నందమూరి అభిమానుల్లో పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అభిమానులకి లేఖ వ్రాసిన బాలయ్య

కాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సంబరాలు జరుపుకోకూడదని, తనని కలవడానికి హైదరాబాద్ కి రాకూడదని బాలయ్య తన అభిమానులకి సోషల్ మీడియా ద్వారా లేఖ వ్రాసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తన పుట్టిన రోజు వేడుకలని జరుపుకోవడం లేదని ఈ లేఖ ద్వారా తన అభిమానులకి బాలయ్య చెప్పారు. మొత్తానికి బర్త్ డే సందర్భంగా ఎలాంటి వేడుకలు లేకపోయినప్పటికీ.. తన లేటెస్ట్ మూవీ పోస్టర్ ని రిలీజ్ చేసి తన అభిమానులని ఖుషీ చేశాడు బాలయ్య. 


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle