newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్

10-10-202110-10-2021 08:54:36 IST
2021-10-10T03:24:36.771Z10-10-2021 2021-10-10T03:24:31.393Z - - 05-12-2021

మొదలైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల కోసం గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెళ్లు ఇక ఈరోజు జరిగే ఎన్నికలతో ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. 

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు​ హక్కును వినియోగించుకోనున్నారు.మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని​ ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్‌ స్కూల్‌ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్‌ స్లిప్‌ తీసుకున్న తర్వాతనే ఓటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తారు.

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021


నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021


ప్రభాస్ రాధే శ్యామ్ పాట ఆషికి ఆ గయీ వచ్చేసింది, లొకేషన్స్ సూపర్

ప్రభాస్ రాధే శ్యామ్ పాట ఆషికి ఆ గయీ వచ్చేసింది, లొకేషన్స్ సూపర్

   01-12-2021


ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన

ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన

   01-12-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

   01-12-2021


సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

   30-11-2021


సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారంటే నమ్మబుద్ది కావడం లేదు

సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారంటే నమ్మబుద్ది కావడం లేదు

   30-11-2021


ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

   30-11-2021


కామెడీ రోల్ లో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

కామెడీ రోల్ లో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

   30-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle