newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఫ్యామిలీ మేన్‌-2 పై సీనియర్ నటుడు మనోబాల ఫైర్

09-06-202109-06-2021 17:58:47 IST
2021-06-09T12:28:47.730Z09-06-2021 2021-06-09T12:28:19.421Z - - 22-06-2021

ఫ్యామిలీ మేన్‌-2 పై సీనియర్ నటుడు మనోబాల ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ది ఫ్యామిలీ మేన్‌-2 సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను ఇబ్బందిపెట్టేలా ఉందని, ఇలాంటి సిరీస్‌లో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పితీరాలని తమిళ సీనియర్ నటుడు మనోబాల డిమాండ్ చేశారు. ఈ సందర్భ్గంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  రాజీ పాత్రని, ఇలాంటి కథను ఒప్పుకొనే విషయంలో నటి సమంత కొద్దిగా ఆలోచించాల్సి నిర్ణయం తీసుకోవలసిందని, ఈ పాత్ర తమిళ ఈలం పోరాటం క్షీణత తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారని ఆయన అన్నారు. 

కాగా ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ వెబ్‌సిరీస్‌ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలువురు నుంచి విమర్శలు చేశారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే దీనిపై తమిళులు తమ నిరసనని తెలియజేశారు. ఈ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలని ఏకంగా ఒక తమిళ ఎంపి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసారు. మరి ఇప్పుడు సీనియర్ నటుడు మనోబాల స్పందనతో ఎ స్థాయిలోకి వెళుతుందో చూడాలి.


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle