newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

23-07-202123-07-2021 12:28:31 IST
2021-07-23T06:58:31.571Z23-07-2021 2021-07-23T06:58:12.945Z - - 22-09-2021

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్షుడిగా అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ గనుక ఎన్నికైతే తాను ఎంతో సంతోషిస్తానని ఈ ఎన్నికల్లో మా అధ్యక్ష బరిలో నిలిచినా నటుడు మంచు విష్ణు అంటున్నారు. అయితే బాలయ్య అసలు మా ఎన్నికలలో పోటీ కూడా చేయడం లేదు, ఎన్నికల బరిలో నిలవని వ్యక్తి అధ్యక్షుడు అయితే తనకి సంతోషం అని మంచు విష్ణు అనడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ‘మా’ అధ్యక్షుడిని ఎన్నుకుంటే తప్పకుండా నేను ఈ ఏడాది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను. అలా కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేస్తాను. అయితే బాలయ్య మా అధ్యక్షుడు అయితే నేను సంతోషిస్తాను.. ఎందుకంటే ఆయన జనరేషన్‌కు చెందిన కొంతమంది నటీనటులు అప్పట్లో ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదు. వాళ్లల్లో అధ్యక్షుడిగా ఎవరైనా నాకు ఆనందమే. కాకపోతే అసోసియేషన్‌ కోసం వాళ్లు ప్రత్యేకంగా సమయం కేటాయించడం అంత సులభంగా జరగకపోవచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం మా అధ్యక్ష బరిలో మంచు విష్ణు తో పాటు ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, నటి హేమ, సీవీఎల్‌ నరసింహారావులు నిలిచారు. దీంతో మా ఎలక్షన్లు ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. ఈ నేపధ్యంలో మంచు విష్ణు అన్న ఈ మాటలు టాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యాయి.

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   4 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   9 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   a day ago


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle