newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేటీఆర్ కు ఆ సలహా ఇచ్చిన మంచు లక్ష్మి.. విపరీతమైన ట్రోల్స్

24-04-202124-04-2021 10:48:19 IST
Updated On 24-04-2021 09:03:40 ISTUpdated On 24-04-20212021-04-24T05:18:19.439Z24-04-2021 2021-04-24T03:25:11.952Z - 2021-04-24T03:33:40.926Z - 24-04-2021

కేటీఆర్ కు ఆ సలహా ఇచ్చిన మంచు లక్ష్మి.. విపరీతమైన ట్రోల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా కరోనా సోకింది. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసారు.  తనకు జరిపిన టెస్టుల తరువాత కరోనా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు పాజిటివ్ రాగా, ప్రస్తుతం ఆయన తమ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

కేటీఆర్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేయగానే.. పలువురు ప్రముఖులు వీలైనంత త్వరగా మీరు కోరుకోవాలంటూ ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా ఓ ట్వీట్ చేశారు. అయితే అది కాస్తా భారీ ట్రోల్స్ కు దారితీసింది. ‘మిత్రమా కేటీఆర్ నువ్వు త్వరగా కోలుకోవాలి. ఈలోపు నా సినిమాలు అన్ని చూసేయ్’ అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.

అయితే మంచు లక్ష్మి ఆ కామెంట్ చేయడం ఆలస్యం ఇక భారీగా ట్రోల్స్ మొదలయ్యాయి. ‘అసలే ఆయన అనారోగ్యంతో ఉంటే.. మీ సినిమాలు చూడమంటారా.. ఇంకేమైనా ఉందా.?’.. అంటూ చెప్పుకొచ్చారు. ‘కరోనాతో పోరాడుతున్న సమయంలో మీ సినిమాలు చూస్తే ఇంక అంతే సంగతులు’ అంటూ సెటైర్లు మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. 

స్వల్పలక్షణాలతో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వాళ్లు దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోండి అంటూ కేటీఆర్ ట్వీట్‌లో చెప్పారు. కరోనా పాజిటివ్‌గా రావడంతో తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచన మేరకు కేటీఆర్ చికిత్స పొందుతున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పార్టీ కార్యకర్తలతో పాటు, అభిమానులు, మిత్రులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి ట్వీట్ చేయడం.. ఆమె మీద విపరీతమైన ట్రోల్స్  వస్తున్నాయి. కరోనా కారణంగా పలువురు రాజకీయ నాయకులు కూడా ఆసుపత్రుల పాలయ్యారు. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   10 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   4 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle