newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

మహేశ్‌ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్

08-05-202208-05-2022 07:31:10 IST
2022-05-08T02:01:10.922Z08-05-2022 2022-05-08T02:00:49.744Z - - 27-05-2022

మహేశ్‌ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఎస్ఎస్‌. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా మే 12న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ 1వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో 'సుమతో తకిట తకిట విత్‌ తమన్‌' పేరుతో చిట్‌చాట్‌ జరిగింది. తర్వాత ఈ మూవీ టీమ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అయితే ఎవరెవరికీ ఏ పొజిషన్ ఇస్తారని తమన్‌ను యాంకర్  సుమ అడిగింది. దానికి తమన్‌ వికేట్‌ కీపర్‌గా పరశురామ్‌, బౌలర్‌గా కీర్తి సురేశ్‌ అని చెప్పాడు. దీంతో తన బౌలింగ్‌కు ఎవరైనా ఔట్‌ కావాల్సిందేనా అని సుమ అడగ్గా.. 'అవును. తన నటనతో బాగా నమ్మించేసింది' అంటూ చెప్పుకొచ్చాడు తమన్‌. అనంతరం మంచి ఫీల్డర్‌ అని సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు పేరు చెప్పాడు తమన్. ఎటునుంచి వచ్చిన బాల్‌ను పట్టుకునేది ఒక కెప్టెన్ అది మహేశ్ బాబు అని తమన్‌ పేర్కొన్నాడు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle