newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Maha Samudram: కరోనా ఎఫెక్ట్.. మహాసముద్రం రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?

21-07-202121-07-2021 11:48:45 IST
2021-07-21T06:18:45.531Z21-07-2021 2021-07-21T06:18:42.900Z - - 10-08-2022

Maha Samudram: కరోనా ఎఫెక్ట్.. మహాసముద్రం రిలీజ్ ఇప్పట్లో లేనట్టేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
Maha Samudram: యంగ్ హీరో శర్వానంద్, RX-100 డైరెక్టర్ అజయ్ భూపతి కలిసి చేస్తున్న సినిమా మహా సముద్రం. హీరో సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అదితీరావు.. అనూ ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు చూస్తుంటే విభిన్నమైన కథ అనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. 

కోవిద్ వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ భారీ బడ్జెట్ సినిమా కారణంగా థియేటర్లలో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle