newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

21-09-202121-09-2021 19:27:00 IST
2021-09-21T13:57:00.601Z21-09-2021 2021-09-21T13:54:13.573Z - - 17-10-2021

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రేమకథా చిత్రాలని నేటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా మెస్మరైజింగ్ టేకింగ్ తో అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ సాధించే దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఆయన దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా వస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ' కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక పెద్ద సినిమాలు సైతం ఓటీటీ వేదికపై విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండడంతో ప్రస్తుతం ఈ సినిమాపైనే తాలీవుడు దృష్టి నెలకొంది.

వినాయక చవితి సందర్భంగా థియేటర్ల లో విడుదల అయిన గోపీచంద్ సీటీమార్ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమా సైతం అంచనాలని అందుకుని బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందన్న ధీమా మేకర్స్ లో కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అన్న ప్రశ్న మాత్రం నెలకొంది. సీటీమార్ లాంటి మాంచి మాస్ సినిమా పడింది. అయినా జనాలు మూడు రోజుల తరువాత తగ్గిపోయారు.. మరి ఈ లవ్ స్టోరీ లాంటి క్లాస్ సినిమాకి మొదటి మూడు రోజులు అయినా ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంటే కాదు ఈ సినిమా రిజల్ట్ ని బట్టి మరికొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదల చేయాలా, లేదా ఓటీటీ లో రిలీజ్ చేయాలా అన్నది డిసైడ్ చేసుకోవడానికి నిర్మాతలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 లవ్ స్టోరీ చిత్రం విడుదలయ్యి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంటుందా.. అన్నదాన్ని బట్టి మిగతా చిత్రాలు ఇటు థియేటర్ల వైపు అడుగులు వేస్తాయా, అటు ఓటీటీ బాట పడుతాయా అన్నది తేలనుందని టాలీవుడ్ టాక్. 

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

   2 hours ago


స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

   5 hours ago


‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

   16-10-2021


బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

   16-10-2021


రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

   14-10-2021


ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

   14-10-2021


మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

   14-10-2021


తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

   13-10-2021


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

   13-10-2021


పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

   12-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle