newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నిర్మాత, నటి మాలాశ్రీ భర్త కోటి రాము ఇకలేరు

27-04-202127-04-2021 10:00:12 IST
2021-04-27T04:30:12.121Z27-04-2021 2021-04-27T04:30:03.905Z - - 14-05-2021

నిర్మాత, నటి మాలాశ్రీ భర్త కోటి రాము ఇకలేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటి మాలాశ్రీ భర్త, నిర్మాత రాము మరణించారు. కొణిగల్ రాము వయసు 52 సంవత్సరాలు.  గత వారం ఆయనకు కరోనా సోకగా బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సోమవారం (ఏప్రిల్‌​26) సాయంత్రం తుది శ్వాస విడిచారు. కొణిగల్‌ రాము కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు తీశారు. 1990ల కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కొణిగల్‌ రాము అప్పట్లో ఏ సినిమా తీసినా బడ్జెట్‌ కోట్లల్లో ఉండేది. దీంతో ఆయన్ను కోటి రాము అని పిలుస్తారు. శాండల్‌ వుడ్‌లో ఏకే 47, లాకప్‌ డెత్‌, సీబీఐ దుర్గ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను ప్రొడ్యూస్‌ చేశారు. కొణిగల్‌ రాము మృతిపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. 

కొణిగల్ రాముకు కరోనా సోకడంతో ఎం.ఎస్.రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనను రక్షించడానికి వైద్యులు ఎంతగానో శ్రమించారు. అయినా కాపాడలేకపోయారు. ఆయన అదే ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కన్నడ చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా రాము యాక్టివ్ గా ఉన్నారు. 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కన్నడ చిత్ర పరిశ్రమకు ఒకానొక సమయంలో భారీ మార్కెట్ లేకపోయినా కూడా కొణిగల్ రాము.. ఏ మాత్రం ఖర్చుకు వెనకడుగు వేసే వారు కాదు. అప్పట్లో ఆయన సినిమా తీయాలంటే కోట్లలో ఖర్చు పెట్టేవారు. 1990లలో కన్నడ ఇండస్ట్రీకి చిన్న మార్కెట్ ఉన్నా కూడా ఆయన మంచి క్వాలిటీతో సినిమాలను తీయాలని అనుకునే వారు. మొదట ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉండే ఈయన.. ఆ తర్వాత నిర్మాతగా మారి 'రాము ఎంటర్ప్రైజెస్' బ్యానర్ పై సినిమాలు తీశారు. చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో అప్పటి టాప్ నటి 'మాలా శ్రీ' తో ఆయనకు పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన కెరీర్ లో 30 సినిమాలు నిర్మాతగా తీయగా 11 సినిమాలలో మాలాశ్రీ నటించారు.  

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   10 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   5 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle