newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

08-05-202108-05-2021 11:42:39 IST
2021-05-08T06:12:39.599Z08-05-2021 2021-05-08T06:12:35.830Z - - 22-06-2021

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పలువురు బాలీవుడ్ నటులు కూడా కరోనా బారిన పడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా కంగనా రనౌత్ కూడా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ట్విట్టర్ కు దూరమైన కంగనా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసింది. తనకు గత కొన్ని రోజుల నుంచి క‌ళ్లు మండుతున్నాయని.. అల‌స‌ట‌గా, నీర‌సంగా అనిపించేదని తెలిపింది. ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ‌దామ‌ని కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. ఈరోజు క‌రోనా పాజిటివ్ అనే రిజ‌ల్ట్ వ‌చ్చిందని కంగనా చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నానని.. నా శ‌రీరంలో క‌రోనా వైర‌స్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంటాయ‌ని నేను భావించ‌డం లేదని తెలిపింది. నేను వాటిని నాశ‌నం చేస్తాను.. మీరు భ‌య‌ప‌డితే, క‌రోనా మ‌రింత భ‌య‌పెడుతుంది.. రండి మ‌నం దాన్ని నాశనం చేద్దాం అంటూ ధైర్యం కూడా చెప్పింది. కొవిడ్ 19 అంటే భ‌య‌ప‌డేంత ఏమీ లేదు. చిన్న‌పాటి ఫ్లూ మాత్ర‌మే, అయితే ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా ఒత్తిడికి గురి చేస్తోందని తెలిపింది కంగ‌నా ర‌నౌత్‌. 

ఇక కంగ‌నా ర‌నౌత్ ను వివాదాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. సోష‌ల్ మీడియా ద్వారా మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టింద‌నే ఆరోప‌ణ‌ల‌పై కంగ‌నా ర‌నౌత్ పై కేసు న‌మోదు చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌తినిధి రిజు ద‌త్తా ఫిర్యాదు చేయడంతో కోల్‌క‌తా పోలీసులు కేసును నమోదు చేశారు. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఫోటోల‌ను వ‌క్రీక‌రించేలా కంగ‌నా అప్‌లోడ్ చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కంగ‌నా పై పోలీసులు ఐపీసీ 153 ఎ, 504, 505 సెక్ష‌న్ల‌తో పాటు ఐటీ చ‌ట్టంలోని 43,66 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన అనంత‌రం నుంచి ఆ రాష్ట్రంలో భారీ అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి.  ఈ నేప‌థ్యంలో కంగ‌నా ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస‌గా వివాదాస్ప‌ద ట్వీట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ట్విట్ట‌ర్ కూడా.. కంగ‌నా మ‌త‌విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ఉన్నాయ‌ని బావించి ఆమె అకౌంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle