newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

13-05-202113-05-2021 12:40:02 IST
Updated On 13-05-2021 09:24:27 ISTUpdated On 13-05-20212021-05-13T07:10:02.320Z13-05-2021 2021-05-13T03:25:47.008Z - 2021-05-13T03:54:27.007Z - 13-05-2021

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్.(రౌద్రం..రణం..రుధిరం) కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తూ ఉన్న సినిమా..! ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 2018లో మొదలైంది. కానీ కరోనా ఫస్ట్‌ వేవ్‌ వల్ల దాదాపు ఎనిమిది నెలలు మేజర్‌ షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు తారక్. ఈ సినిమాలో గ్రాఫిక్స్, సాంకేతికతకు సంబంధించిన పని కూడా చాలానే ఉందని.. యాక్షన్‌ సన్నివేశాల గురించి చెప్పాలంటే ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను అక్టోబరులోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని తెలిపారు. 

కరోనా ప్రభావం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా బడ్జెట్‌ని కానీ, కథను కానీ ప్రభావితం చేయలేదన్నారు. మా వర్కింగ్‌ స్పీడ్‌ని బాగా దెబ్బతీసింది.  కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడం మాతో పాటు ఇండస్ట్రీలో ఓ కొత్త ఆశను రేపిందన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ విషయం నిర్మాతలు ఎప్పుడూ ఆలోచించలేదు. ‘బాహుబలి’, ‘జురాసిక్‌ పార్క్‌’, ‘అవెంజర్స్‌’ వంటి సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్‌ పూర్తి స్థాయిలో ఎంజాయ్‌ చేయలేరని నా భావన. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చారు తారక్.  

‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్‌ ఇలా దేశవ్యాప్తంగా సినీ మార్కెట్స్‌ను కలిపేశారు. ఇండియన్‌ సినిమాలు ‘బాహుబలి, దంగల్‌’ వంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నేను, రామ్‌చరణ్‌ నటిస్తున్నాం.. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాజమౌళితో నాకిది నాలుగో సినిమా..  2001లో తొలిసారి ఆయన సినిమాలో నటించాను.. ఇండియన్‌ సినిమాలో ఏదో సాధించాలనే తపన, ఆలోచనలు అప్పట్నుంచే రాజమౌళిలో ఉన్నాయన్నారు. నటీనటుల్లో ఉన్న నటనా నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించునే అవకాశం ఇస్తారు రాజమౌళి. అలాగే ఆయన విజన్‌కు తగ్గట్లు మనల్ని కూడా మౌల్డ్‌ చేస్తారు.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం 18 నెలలుగా కష్టపడుతూనే ఉన్నాను. ఫిజికల్‌ అప్పియరెన్స్‌ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాను. ఈ సినిమాకు ముందు నేను 71 కేజీల బరువు ఉండేవాడిని. కానీ ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది కిలోల మజిల్స్‌ పవర్‌ పెంచాల్సి వచ్చిందని తెలిపారు. 

వెండితెరపై ఆడియన్స్‌ చూస్తున్నప్పుడు థియేటర్స్‌లోని సీట్లలో కూర్చోలేరు. అంతలా ఆస్వాదిస్తారు.. ఆశ్చర్యపోతారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి ఏ విషయమైనా బయటకు చెబితే రాజమౌళి ఓ గొడ్డలి పట్టుకుని నా వెంట పడతారని ఎన్టీఆర్ చెప్పారు. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచనలు లేవనీ.. నిర్మాతగా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను చూపించాలని ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లానే ఈ సినిమా కూడా పాన్‌ ఇండియా స్థాయి సినిమా. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతూ ఉన్నానని కూడా ఎన్టీఆర్ వివరించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle