newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

10-05-202110-05-2021 11:15:03 IST
2021-05-10T05:45:03.182Z10-05-2021 2021-05-10T05:44:53.988Z - - 22-06-2021

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

యాంకర్, నటుడు టిఎన్ఆర్ కన్నుమూశారు. ఆయన అసలు పేరు తుమ్మల నరసింహా రెడ్డి. ఎన్నో సంచలన ఇంటర్వ్యూలు ఆయన చేశారు. యూ ట్యూబ్ లో  'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అనే షో ద్వారా ఎంతో మంది ప్రముఖులను ఆయన తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేశారు. పలువురు ప్రముఖుల దగ్గరకు వెళ్లి మరీ ఇంటర్వ్యూలు చేశారు. చాలా మంది నటులను పిలిపించుకుని మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఉన్నారు. 

గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్‌ఆర్‌ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా బారిన పడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని.. దాదాపు కోమాలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆయన కోలుకోవాలని చాలా మంది ఆకాంక్షించారు. ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన టిఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన శరీరం కూడా వైద్యానికి రెస్పాండ్ కావడం లేదని.. అత్యంత విషమంగా ఉందని చెప్పిన వైద్యులు.. మరికొద్ది గంటల్లోనే తుదిశ్వాస విడిచారని తెలియజేశారు. యూ ట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈయన పని చేస్తుంటారు. ''TNR కన్నుమూశారని తెలిసి షాకయ్యా. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం'' అని హీరో నాని చెప్పుకొచ్చారు. పలువురు జర్నలిస్టులు, సినీ ప్రముఖులు టిఎన్ఆర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle