newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోడ్డు పక్కన టిఫిన్ చేసిన వీడియో వైరల్..

15-09-202115-09-2021 09:27:35 IST
2021-09-15T03:57:35.188Z15-09-2021 2021-09-15T03:57:30.984Z - - 22-09-2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోడ్డు పక్కన టిఫిన్ చేసిన వీడియో వైరల్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక స్టార్ హీరో రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్ లో టిఫిన్ చేయడం అన్నది ఊహించుకుంటామా..? అస్సలు ఊహకు అందని ఈ సంఘటన కాకినాడలో జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మోవీ పుష్ప సినిమా షూటింగ్ కోసం మూవీ టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవ‌రం మీదుగా వెళుతుండగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు విగ్రహం పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్‌ వద్ద ఆగి బన్ని టిఫిన్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక మామూలు వ్యక్తిగా సాదాసీదాగా ఇలా రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్‌ చేసి అనంతరం బయటకు వచ్చి బిల్లు కడుతున్న అల్లు అర్జున్‌ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ షూటింగ్‌ కాకినాడ దగ్గర రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో యాక్షన్‌ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలయిన 'దాక్కో.. దాక్కో మేక' సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సాధించి రికార్డు సృష్టించింది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలలో వస్తుందన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదల కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.  

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   4 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   9 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   a day ago


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle