newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రభాస్ కోసం హాలీవుడ్ నటులు డైరెక్టర్ లు ఆరా తీస్తున్నారు..

12-01-202212-01-2022 08:07:16 IST
2022-01-12T02:37:16.990Z12-01-2022 2022-01-12T02:37:09.104Z - - 24-01-2022

ప్రభాస్ కోసం హాలీవుడ్ నటులు డైరెక్టర్ లు ఆరా తీస్తున్నారు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభాస్ కోసం హాలీవుడ్ నటులు డైరెక్టర్ లు ఆరా తీస్తున్నారని స్టార్ ప్రొడ్యూసర్ సి అశ్వనీదత్ అన్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న క్రేజీ మూవీ `ప్రాజెక్ట్ కె`. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నవిషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. `ప్రాజెక్ట్ కె` ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయని అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ నెలాఖరున మూడవ షెడ్యూల్ ప్రారంభిస్తామన్నారు. 

ఈ షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే పాల్గొన బోతున్నారని తెలిపారు.అశ్వనీదత్ తాజాగా ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు వుంటుందో చెప్పేసి షాకిచ్చారు. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది అంటే 2023లో మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.అత్యంత భారీ స్థాయిలో వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు క్రియేటి హెడ్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా ఈ మూవీని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle