newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

07-05-202107-05-2021 16:05:59 IST
2021-05-07T10:35:59.421Z07-05-2021 2021-05-07T08:36:29.606Z - - 22-06-2021

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నటుడు సిద్ధార్థ భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే..! భారతీయ జనతా పార్టీ చర్యలు ఏ మాత్రం ఆయనకు నచ్చడం లేదు. దీంతో పలు మార్లు ఆ పార్టీని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తూనే ఉన్నారు. సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉండగా.. తన  కుటుంబసభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా ఆయన టార్గెట్ చేశారు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ భారీ కౌంటర్ వేశారు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని అన్నారు. 'లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా విష్ణు వర్ధన్ రెడ్డి హీరో సిద్ధార్థను గెలికినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కొద్దిరోజుల కిందట సిద్ధార్థ ఫోన్ నెంబర్ ఇంటర్నెట్లో లీక్ అవడంతో తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కొందరు నాయకులు హీరో సిద్ధార్థ ని చంపేస్తామని బెదిరించసాగారు. సిద్ధార్థ ఇంట్లో ఉంటున్న మహిళలపై కూడా దారుణంగా అత్యాచారం చేస్తామని అసభ్యకరంగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారని ఇటీవలే సిద్ధార్థ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. సిద్ధార్థ తెలుగులో “మహా సముద్రం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈచిత్రానికి ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ “అజయ్ భూపతి” దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రం తమిళం, తెలుగు రెండు భాషలలోనూ విడుదల కానుంది. తెలుగులో సిద్ధార్థ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle