newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రంగం, బ్రదర్స్ సినిమాల దర్శకుడు కె.వి.ఆనంద్‌ కన్నుమూత

30-04-202130-04-2021 08:33:52 IST
2021-04-30T03:03:52.334Z30-04-2021 2021-04-30T03:03:48.354Z - - 14-05-2021

రంగం, బ్రదర్స్ సినిమాల దర్శకుడు కె.వి.ఆనంద్‌ కన్నుమూత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్‌ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు గుండెపోటుతో క‌న్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అయిన కెవి ఆనంద్ మీడియా రంగంలో కూడా పని చేశారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. క‌ల్కి, ఇండియా టుడే దిన ప‌త్రిక‌ల్లో ప‌నిచేశారు. ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, ర‌జినీకాంత్ శివాజీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు.సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. రంగం(కో) సినిమా తెలుగులోనూ సూప‌ర్ హిట్ అయ్యింది. బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

ఓ సాధారణ స్టిల్ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి దర్శకుడిగా ఎదిగారు కేవీ ఆనంద్. రొటీన్ కాన్సెప్టులు అసలు ఇష్టం ఉండదు ఆయనకు. రంగం, బ్రదర్స్, వీడొక్కడే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చేసిన కేవీ ఆనంద్ కు ఆ టైమ్ లో ఫొటోగ్రఫీపై ఇష్టం పెరిగింది. ఆ రోజుల్లో ఆయన తీసిన ఎన్నో ఫొటోలు వివిధ మ్యాగజైన్స్ లో పాపులర్ అయ్యాయి.  ఫొటోగ్రఫీ నుంచి సినిమాటోగ్రఫీ వైపు ఆయన మనసు మళ్లింది. వెంటనే వెళ్లి పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. పీసీ శ్రీరామ్  అసిస్టెంట్లలో ఆఖరి వాడిగా జాయిన్ అయినప్పటికీ కేవీ ఆనంద్ లో ఉన్న టాలెంట్ ను పీసీ శ్రీరామ్ గుర్తించారు. సినిమాటోగ్రాఫర్ గా తన తొలి సినిమాతో ఏకంగా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ వ‌హించిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది.  తమిళ్ లో ఆయన చేసిన మొదటి సినిమా ప్రేమదేశం. ఈ సినిమాలో కేవీ ఆనంద్ వర్క్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. చెన్నైలోని ఎన్నో రొటీన్ లొకేషన్లను కేవీ ఆనంద్, ఈ సినిమాలో అద్భుతంగా చూపించి అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు, బాయ్స్, శివాజీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమానే సినిమాటోగ్రాఫర్ గా ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. డైరక్టర్ గా 7 సినిమాలు తీశారు. వీటిలో కేవీఆనంద్ కు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా రంగం. తెలుగులో ఆయన చేసిన ఒకే ఒక్క స్ట్రయిట్ మూవీ పుణ్యభూమి నాదేశం. మోహన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు కేవీ ఆనంద్. కె.వి.ఆనంద్ మృతిపై చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసింది. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   9 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   4 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle