newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

జూ. ఎన్టీఆర్ తాజా చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో డా. రాజశేఖర్

10-01-202210-01-2022 22:39:01 IST
2022-01-10T17:09:01.135Z10-01-2022 2022-01-10T17:08:57.178Z - - 24-01-2022

జూ. ఎన్టీఆర్ తాజా చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో డా. రాజశేఖర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ కి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో ఎన్టీఆర్‌30 ప్రాజెక్ట్‌ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ కు క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ బాబాయ్‌ది చాలా పవర్‌ ఫుల్‌ రోల్‌ అని, ఆ పాత్రకు రాజశేఖర్‌ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్‌ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా నటించేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ప్రస్తుతం హీరో రాజశేఖర్‌ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్‌ మూవీ  ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle