newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

12-05-202112-05-2021 11:45:55 IST
2021-05-12T06:15:55.160Z12-05-2021 2021-05-12T06:15:49.170Z - - 22-06-2021

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నందమూరి హీరోల సినిమాలు అంటే అభిమానులకు పండగే. నందమూరి అభిమానులకు సినిమాల హిట్స్ తో పని ఉండదు ఆ హీరోల సినిమాలు వస్తే చాలు ఇంకా హిట్ అయితే వాళ్లకు ఇంకా ఆనందం. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలు అంటే చెప్పనవసరం లేదు. నందమూరి హీరోల మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక ఇప్పుడు తీరనుందని ఒక వార్త ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక మంచి స్టోరీ రెడీ చేసాడని దానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 

డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయిన మొదటి సినిమా పటాస్ తో బంపర్ హిట్ అందుకుని వరుసగా సక్సెస్ లతో నిర్మాతల పంట పండిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు అయితే ఏకంగా ఐదు సినిమాలు అనిల్ రావిపూడి తో తీసి ఇండస్ట్రి  హిట్లు అందుకున్నాడు. ఇక అనిల్ రావిపూడిని నమ్మి కళ్యాణ్ రామ్ తానే నిర్మాతగా పటాస్ మూవీ తీసాడు. అనిల్ రావిపూడి గురించి బాగా తెలిసిన కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తూ తాను బాలయ్య కు స్టోరీ వినిపించానని అది ఇంకా చర్చల దశలోనే ఉందని కానీ అది అందరు అనుకుంటున్నట్టు మల్టీస్టారర్ కాదని, మల్టీస్టారర్ పై వస్తున్న వార్తలు జస్ట్ రూమరే అని తేల్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి హీరో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్-3' చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మధ్యనే కరోనా బారిన పడిన అనిల్ కోలుకుని తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసే లోపలే కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగులు అన్ని నిలిపివేశారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle