newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

`టాక్సీవాలా` హీరోయిన్ కి కరోనా పాజిటివ్

20-01-202220-01-2022 09:07:41 IST
2022-01-20T03:37:41.243Z20-01-2022 2022-01-20T02:43:00.673Z - - 27-05-2022

`టాక్సీవాలా` హీరోయిన్ కి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ తో పాటు కోలివుడ్ కు చెందిన స్టార్స్ 13 మంది కోవిడ్ బారిన పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, లక్ష్మీ మంచు, మంచు మనోజ్, ఖుష్బూ, రాజేంద్ర ప్రసాద్, కీర్తి సురేష్, శోభన, త్రిష, తమన్, విష్ణు, విశాల్, విశ్వక్ సేన్, బండ్ల గణేష్ కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే ఇందులో కొంత మంది కోలుకోగా మరి కొంత మంది హొమ్ ఐసోలేషన్ లో వుంటూ చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరింది. విజయ్ దేవరకొండ నటించిన `టాక్సీవాలా` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ప్రియాంక జవాల్కర్ తాజాగా తాను కోవిడ్ బారిన పడినట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అందరికి హాయ్.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తాను కోవిడ్ బారిన పడ్డానని తనకు పాజిటివ్ అని తేలిందని తెలిపింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో వున్నానని డాక్టర్ల సలహాలు పాటిస్తూ కావాల్సిన మందులు వాడుతున్నానని తెలిపింది. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా తనతో టచ్ లో వున్న వారందరూ టెస్ట్ చేయించుకోవాలని అంతే కాకుండా ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని తప్పని సరి అయితేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేసింది. ప్రియాంక జవాల్కర్ తాజాగా ఎస్.ఆర్ . కల్యాణ మండపం, గమనం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle