newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాకి కరోనా పాజిటివ్

11-01-202211-01-2022 20:24:56 IST
2022-01-11T14:54:56.695Z11-01-2022 2022-01-11T14:54:53.461Z - - 24-01-2022

పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాకి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. సినీ పరిశ్రమలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్‌, రాజేంద్రప్రసాద్‌, త్రిష సహా పలువురు  కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

'అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా  బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి  వ్యాక్సిన్‌ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్‌ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ రేణు దేశాయ్‌ ఇన్‌స్టాలో పేర్కొన్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle