newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన

01-12-202101-12-2021 10:11:02 IST
2021-12-01T04:41:02.490Z01-12-2021 2021-12-01T04:40:47.056Z - - 24-01-2022

ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చాలా చాలా దురదృష్టకరమని, ఆయనతో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని తానేనని.. ఆ తర్వాత ఫోన్‌ ఆఫ్‌ చేసి ఆస్పత్రిలో చేరారని చెప్పారు. మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని కూడా చెప్పానని చిరంజీవి అన్నారు. ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను ‘మిత్రమా’ అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయా. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన జ్ఞాపకార్థం తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం చేస్తానని అన్నారు. 

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ పుట్టిన జాతికి ఎవరైతే కీర్తి తెస్తారో వారు ఉన్నా, లేకున్నా చిరస్థాయిగా నిలిచిపోతారని.. అలాంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు. తెలుగు భాష, సాహిత్యానికి ఆభరణంలాంటి వ్యక్తి సిరివెన్నెల అని కొనియాడారు. తాను నటించిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. సిరివెన్నెల లేరనే వార్తతో చలనచిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. మరో నటుడు వెంకటేష్ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో సాహిత్యరంగంలో ఓ లెజెండ్‌ను కోల్పోయామని అన్నారు. తన కెరీర్‌ తొలినాళ్ల నుంచి సిరివెన్నెలతో కలిసి పనిచేశానని, స్వర్ణకమలం నుంచి నారప్ప వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా సిరివెన్నెల భౌతికకాయాన్ని సందర్శించడానికి రాజకీయ, సినీ ప్రముఖులే కాకుండా సిరివెన్నెల అభిమానులు సైతం ఫిలిం ఛాంబర్ వద్దకు తరలి వస్తున్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle