newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

బంగార్రాజు ట్రైలర్ విడుదల, తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే ఫ్రేంలో.. అభిమానులు ఫిదా

11-01-202211-01-2022 19:22:49 IST
2022-01-11T13:52:49.810Z11-01-2022 2022-01-11T13:49:55.923Z - - 24-01-2022

బంగార్రాజు ట్రైలర్ విడుదల, తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే ఫ్రేంలో.. అభిమానులు ఫిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్లుగా నటిస్తున్న‘బంగార్రాజు’ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'సోగ్గాడే చిన్నినాయనా' కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగార్రాజు మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అంతేకాదు నాగార్జున్‌, నాగ చైతన్యలు వినూత్నం మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బంగార్రాజు మూవీ ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఇక ట్రైలర్‌ విషయానికి వస్తే.. ఈ బంగార్రాజులుగా తండ్రికోడులు ఇద్దరూ ఒకే ఫ్రేంలో ఫిదా చేస్తుండడంతో అక్కినేని అభిమానులకి పండుగే. ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీతో చై బాగా ఆకట్టుకొనున్నాడని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. 

బుల్లెట్‌ బండిపై చై ఇచ్చే ఎంట్రీ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాగ్‌, చైలు తమ యాస, మ్యానరిజంతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక కృతీశెట్టి పాత్ర ఈ సినిమాలో బాగా అలరించనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌గా పోటీ చేస్తూ స్టేజ్‌పై కృతీ ఇచ్చే ప్రసంగం మంచి కామెడీ టచ్‌ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. అన్ని కమర్షియల్‌ హంగులతో, కామెడీ, రొమాంటిక్‌, యాక్షన్‌ సీన్స్‌తో బంగార్రాజు ట్రైలర్‌ను మేకర్స్‌ ఆసక్తిగా మలిచారు. ట్రైలర్‌ చూస్తుంటే సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసేలా ఉంది. ఈ సంక్రాంతి అక్కినేని బంగార్రాజులు హిట్‌ కొట్టడం ఖాయం అని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle