రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-202211-05-2022 21:44:40 IST
2022-05-11T16:14:40.962Z11-05-2022 2022-05-11T16:14:37.801Z - - 27-05-2022

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` షో `ఆహా` లో ప్రసారం అయ్యి రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. మోస్ట్ వీవుడ్ రియాలిటీ షోగా `అన్ స్టాపబుల్` ఐఎండీడీలో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుని పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలయ్య తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన షోగా కూడా రికార్డుని సొంతం చేసుకుంది. అంతే కాదు సెలబ్రిటీ టాక్ షోల్లో బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది. ఈ షోలో ప్రముఖులతో తనదైన స్టైల్లో బాలయ్య జరిపిన సంభాషణలు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుని సూపర్ హిట్ షోగా నిలబెట్టాయి. అయితే తాజాగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. సెలబ్రిటీ టాక్ షోల్లో నెంబర్ వన్ షోగా రికార్డులు సొంతం చేసుకున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` తాజాగా బెస్ట్ రీజినల్ టీవీ ప్రోగ్రామ్, బెస్ట్ రీజినల్ టీవీ రియాలిటీ షో విభాగాల్లో రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకుంది. త్వరలోనే ఈ షో సీజన్ 2 ప్రారంభిం కానున్న నేపథ్యంలో రెండు సిల్వర్ ట్రోఫీలు ఈ షోకు దక్కడం విశేషం.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-2022
ఇంకా