newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయంతో 'మా ' కి రాజీనామా చేసిన నాగబాబు

11-10-202111-10-2021 09:15:03 IST
Updated On 11-10-2021 12:11:53 ISTUpdated On 11-10-20212021-10-11T03:45:03.453Z11-10-2021 2021-10-11T03:44:53.279Z - 2021-10-11T06:41:53.878Z - 11-10-2021

మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయంతో 'మా ' కి రాజీనామా చేసిన నాగబాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మా ఎన్నికలలో మొదటి నుండీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కి పూర్తి మద్దతు తెలిపిన మెగా బ్రదర్ నాగబాబు సమయం దొరికినప్పుడల్లా మంచు విష్ణు ప్యానల్ సభ్యులపై, మంచు విష్ణు పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మా అధ్యక్షుడు గా మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలవడంతో నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్‌లో "నా" ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు' అంటూ ట్వీటర్ ద్వారా తెలిపారు.. 48 గంటల్లో తన రాజీనామా లేఖను మా కార్యాలయానికి పంపిస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే చిరంజీవి మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సభ్యులందరూ సంయమనం పాటించాలని, మా లో ఎవరు గెలిచినా చివరకి 'మా' గెలిచినట్లే అని ప్రకటించడం విశేషం.

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

సినిమా వాళ్లు సర్కస్ వాళ్ళని నిరూపించారు

   2 hours ago


స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

స్పిరిట్ మూవీకి భారీ రెమ్యునరేషన్ అందుకొంటున్న ప్రభాస్

   5 hours ago


‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

‘మా’ అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం.. ఓటమి బాధతో హాజరుకాని మెగా ఫ్యామిలీ

   16-10-2021


బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

బాయ్‌ఫ్రెండ్ విక్కీ కౌశల్ సినిమా బెనిఫిట్ షో కి కత్రినా కైఫ్

   16-10-2021


రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దుర్గమ్మకే తెలియాలి.

   14-10-2021


ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

ఆర్యన్ ఖాన్ కామన్ సెల్‌కు మార్చారు: జైలు సూపరింటెండెంట్

   14-10-2021


మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

మా ఎన్నికల ఎఫెక్ట్.. శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్ద్యేశించో..?

   14-10-2021


తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే వెబ్ సిరీస్ లు రావాల్సిన అవసరం ఉంది.

   13-10-2021


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా..

   13-10-2021


పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

పాన్ మసాలా బ్రాండ్‌ కి షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

   12-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle