newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

24-07-202124-07-2021 19:46:56 IST
2021-07-24T14:16:56.969Z24-07-2021 2021-07-24T14:11:58.439Z - - 22-09-2021

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హీరో ఆర్య కొత్తసినిమా సార్పట్టు పరంపర.. ఈ సినిమా ఈనెల 22 న అమెజాన్ ప్రైం లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో స్ట్రీమింగ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో బాక్సర్ గా నటించిన ఆర్య ఈ సినిమా కోసం తన శరీర ఆకృతిని మలుచుకోడానికి ఎంత కష్టపడ్డాడన్న విషయం సినిమాలో కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం ఆర్యకి సంతోషకరమైన విషయం అయితే ఆర్య భార్య పండంటి కూతురికి జన్మనిచ్చిన వార్త ఆర్య కి ఇంకా సంతోషం కలిగించే వార్త. ఆర్య భార్య, హీరోయిన సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే ఈ విషయాన్ని మరో హీరో విశాల్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశాడు. ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్య‌త‌లు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్‌ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్య, విశాల్‌ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ హైదరబాద్‌లో జరుగుతుంది. అఖిల్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత గజినీకాంత్ మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ఆర్యతో ప్రేమాయణం సాగించింది. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. 

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

ట్రేండింగ్ ట్రోల్స్ లో యోగి బాబు పెయి మామ కొత్త సినిమా

   5 hours ago


మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

మాల్దీవుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ బికినిలో హల్ చల్

   9 hours ago


మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ రిలీజ్

   a day ago


శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమా పైనే అందరి చూపు..

   a day ago


నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

నటుడు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కి బెయిల్ మంజూరు

   21-09-2021


రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

రాంగోపాల్ వర్మ, ఉపేంద్ర కాంబినేషన్ లో మూవీ..?

   21-09-2021


నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటగా... దగ్గుబాటి రానా

   20-09-2021


తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన హీరో అడవిశేష్

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ కి రంగం సిద్దం

   20-09-2021


ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

ఐటీ దాడులపై స్పందించిన రియల్ హీరో సోనూసూద్

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle