ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-202210-05-2022 08:28:10 IST
2022-05-10T02:58:10.846Z10-05-2022 2022-05-10T02:57:46.775Z - - 27-05-2022

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు మొట్టమొదటి సారి కలిసి నటించిన ఆచార్య మూవీ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ చిత్రం గా నిలిచింది. ఈ సినిమా చూసి మెగా అభిమానులు సైతం పెదవి విరిచారని వార్తలు వస్తున్నాయి. ఇక దర్శకుడు కొరటాల శివకి మొట్టమొదటి అపజయం ఆచార్య రూపంలో పలుకరించింది. అయితే ఆచార్య పరాజయానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో సంగీత దర్శకుడు మణిశర్మ మెప్పిస్తాడని నమ్మి చిరంజీవి అవకాశం ఇస్తే ఆచార్య విషయంలో మణిశర్మ తీవ్రంగా నిరాశ పర్చాడు. ఒకటి రెండు పాటలు పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా ఓవరాల్ గా మ్యూజిక్ కు నెగటివ్ మార్కులు పడ్డాయి. అయితే ఆచార్య సక్సెస్ అయితే మళ్లీ మహేష్ బాబుతో పాటు సీనియర్ స్టార్ హీరోలు కూడా మణిశర్మ ను పిలిచి అవకాశం ఇస్తారని అంతా భావించారు. కాని మొత్తం తారు మారు అయ్యింది. ఆచార్య వంటి అద్బుతమైన అవకాశం ను మెలోడీ బ్రహ్మా మణిశర్మ మిస్ చేసుకున్నాడు. పాటలకు స్కోప్ లేదు అనుకుంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా సక్రమంగా ఇస్తే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి నమ్మి అవకాశం ఇస్తే ఆచార్య కు లాభం కాదు కదా నష్టం కలిగించాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-2022
ఇంకా