newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..

11-06-202111-06-2021 12:09:34 IST
2021-06-11T06:39:34.717Z11-06-2021 2021-06-11T06:39:24.899Z - - 22-06-2021

వరుస సినిమాలతో దూసుకుపోతున్న బన్ని..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

బన్నీ ఖాతాలో వరుసగా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం చారా వరకు షూటింగ్ అయ్యింది. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ స్పెషల్‌ వీడియో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. కాగా సుకుమార్, బన్ని కాంబినేషన్ లో రూపొందిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు ఘనవిజయం సాధించడంతో పుష్ప పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక పుష్ప తరువాత బన్ని వెంటనే వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో ‘ఐకాన్‌ కనబడుటలేదు’ చేయనున్నారు. ఇందులో బన్ని ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమా తరువాత పుష్ప 2 చిత్రంపై బన్నీ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే మొదటి భాగం పూర్తీ చేసుకునున్న పుష్ప చిత్రం లోని మేజర్ షూటింగ్ కి బన్ని ‘ఐకాన్‌ కనబడుటలేదు’ సినిమా పూర్తయ్యాక డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం బన్ని మూడు చిత్రాలని సెట్స్ మీద రెడీగా పెట్టుకున్నాడు. ఈ మూడు చిత్రాలు పూర్తి కాగానే బన్ని మరో మూడు చిత్రాలకి ఒకే చెప్పాడు. అందులో ఒకటి మురుగదాస్‌, మరొకటి బోయపాటి శ్రీను, ఇంకొకటి కొరటాల శివ దర్శకత్వం లో ఉండబోతుంది. అయితే ఈ మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయినప్పటికీ ఏది ముందు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే బన్నీ - ప్రశాంత్‌నీల్‌ కాంబోలో కూడా ఓ భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరో వైపు విక్రమ్‌ కుమార్‌ సైతం బన్నీ కోసం ఒక మంచి కథని రెడీ చేస్తున్నారు. దీన్ని బట్టి బన్నీ డిక్షనరీలో మరో మూడు సంవత్సరాల వరకు ఖాళీ లేదని తెలుస్తోంది. మొత్తానికి బన్నీ వరుస సినిమాలని సెట్ చేసుకున్నాడు.


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle