newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

పుష్ప తరువాత ఆ డైరెక్టర్ తోనే అల్లు అర్జున్ సినిమానా..?

09-06-202109-06-2021 11:25:13 IST
Updated On 09-06-2021 11:25:44 ISTUpdated On 09-06-20212021-06-09T05:55:13.622Z09-06-2021 2021-06-09T05:55:08.000Z - 2021-06-09T05:55:44.969Z - 09-06-2021

పుష్ప తరువాత ఆ డైరెక్టర్ తోనే అల్లు అర్జున్ సినిమానా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు ఉప్పెన సినిమా ద్వారా బిగ్గెస్ట్ సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. దీనితో బుచ్చిబాబు తరువాత మూవీ ఒక పెద్ద స్టార్ తో ఉండబోతోందని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బుచ్చిబాబు ఈ మధ్య అల్లు అర్జున్ ని కలిసినట్లు, బుచ్చిబాబు చెప్పిన స్టొరీ లైన్ అల్లు అర్జున్ కి నచ్చడంతో పుష్ప తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

బుచ్చిబాబు గురువు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా వున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ కి మరో మైలు రాయిలా నిలుస్తుందని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. గతంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ కి రంగస్థలం ద్వారా బిగ్గెస్ట్ సక్సెస్ అందించిన సుకుమార్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి కూడా ఆ స్థాయిలో సక్సెస్ ని అందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ చేసే సినిమా పై ఇప్పటికీ క్లారిటీ లేదు, ఇప్పటికే బన్నీ లిస్ట్ లో బోయపాటి శ్రీను, వేణుశ్రీరామ్ లాంటి దర్శకులు లైన్ లో వున్నారు. అయినప్పటికీ బుచ్చిబాబు చెప్పిన స్టోరీ లైన్ నచ్చితే ముందుగా బుచ్చిబాబు సినిమా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్.


Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle