newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా బారిన పడ్డ అల్లు అర్జున్

28-04-202128-04-2021 11:55:58 IST
2021-04-28T06:25:58.410Z28-04-2021 2021-04-28T06:25:54.745Z - - 14-05-2021

కరోనా బారిన పడ్డ అల్లు అర్జున్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులకు కరోనా మహమ్మారి సోకుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తనకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్ లో ఉన్నానని బన్నీ చెప్పుకొచ్చారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఇంటి వద్దే ఉంటే సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి అని అభిమానులకు పిలుపునిచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు కరోనా సోకడంతో పుష్ప చిత్ర యూనిట్ లో కూడా కరోనా కలవరం మొదలైంది. అల్లు అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రష్మిక కథానాయికగా కనిపించనుంది. విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. అల్లు అర్జున్ పాత్రను చూపించారు. యూ ట్యూబ్ లో ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్లో ఇంతవరకూ అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. అంతకన్నా వేగంగా ఆ రికార్డును 'పుష్ప' టీజర్ టచ్ చేసింది. ఇక ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప' టీజర్ కొత్త రికార్డును సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. 'తగ్గేదేలే' అంటూ పుష్ప టీజర్ లో సింగిల్ డైలాగ్ తో అల్లు అర్జున్ దుమ్ము దులిపాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదల కాబోతోంది. 

Image

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   9 hours ago


చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

చెత్తగా సల్మాన్ సినిమా.. ప్రభుదేవాను ఏకంగా డైరెక్షన్ మానేయమంటున్నారు

   4 hours ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   13-05-2021


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle