newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

కోలీవుడ్ నటుడు శింబు కు అరుదైన గౌరవం

12-01-202212-01-2022 08:39:08 IST
2022-01-12T03:09:08.538Z12-01-2022 2022-01-12T03:09:01.537Z - - 24-01-2022

కోలీవుడ్ నటుడు శింబు కు అరుదైన గౌరవం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన కోలీవుడ్ హీరో శింబుకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు శింబు అందించిన సేవలకు గానూ ఆయనకు తమిళనాడులోని ప్రముఖ వేల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ని అందించింది. ఈ విషయాన్ని హీరో శింబు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ని అందించిన వేల్స్ యూనివర్సిటీకి శింబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు శింబు. తన జీవితంలో సినిమా వుండటానికి కారణం వారేనని అందుకే ఈ గౌరవాన్ని వారికి అంకితం ఇస్తున్నానని శింబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఇక ఓ నటుడిగా తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శింబు తల్లిదండ్రులు టి. రాజేందర్ ఉష కూడా పాల్గొన్నారు. శింబు గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆయన తల్లి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముద్దాడింది. తాజాగా `మానాడు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని శింబు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle