newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

రాంచరణ్ తర్వాత ఎన్టీఆర్.. తారక్ ఎంట్రీపై సెన్సేషనల్ అప్ డేట్

29-03-202029-03-2020 17:35:37 IST
2020-03-29T12:05:37.376Z29-03-2020 2020-03-29T12:03:37.763Z - - 01-06-2020

రాంచరణ్ తర్వాత ఎన్టీఆర్.. తారక్ ఎంట్రీపై సెన్సేషనల్ అప్ డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్ఆర్ఆర్.... మూవీ టైటిల్ సస్పెన్స్ వీడిపోయింది. రౌద్రం రణం రుధిరం అంటూ రాజమౌళి సినిమా టైటిల్ విడుదలచేశారు. ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొంతకాలం అభిమానులను ఊరించిన చిత్ర యూనిట్ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మరో అప్ డేట్ విడుదలచేసింది. బీమ్ ఫర్ రామరాజు అంటూ రాంచరణ్ ఎంట్రీని అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 

కొమురం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ మధ్యే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం. అలాగే తాజాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా.. సీతారామ రాజుగా చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకోంది. అలాగే వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో గంభీరంగా ఎన్టీఆర్ వాయిస్‌ అదిరిపోయిందనే చెప్పాలి. చరణ్ పాత్రను ఆయన పరిచయం చేసిన తీరు 

మరి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న వేళ డేట్ అనౌన్స్ చేసింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ఎంట్రీ టీజర్ విడుదలచేయనున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. చరణ్ పరిచయానికి సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరుణంలో అంతకు మించి ఎన్టీఆర్ వీడియో ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

అందుకు తగ్గట్టుగానే కొమురం భీం ని చరిత్రలో నిలిచిపోయేలా చూపించనున్నారు.  ఈ చిత్రంలో హీరోయిన్లు ఒలివియా మోరిస్, అలియా భట్‌లు నటిస్తున్నారు. ఈ సినిమా 2021లో జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ మూవీలో కీలకమయిన పూణె షెడ్యూల్ వాయిదా వేశారు. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమా షూటింగ్ మరోమారు ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.రాంచరణ్ వీడియోలో హైలైట్ అయింది మాత్రం ఎన్టీఆరే. ఇప్పటివరకూ తారక్ అంటే ఎవరో చాలామందికి తెలీదు. కానీ ఇప్పుడు తారక్ సముద్రంలో ఉప్పెనలా వస్తాడు. శాంపిల్ వీడియో ఇలా వుంటే..తారక్ వీడియో ఎలా వుంటుందో చూడాలి.

రాంచరణ్ తర్వాత ఎన్టీఆర్.. తారక్ ఎంట్రీపై సెన్సేషనల్ అప్ డేట్


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle