రహస్యంగా కాజల్ ఎంగేజ్ మెంట్? ఎవరితోనో తెలుసా?
24-08-202024-08-2020 08:28:10 IST
Updated On 25-08-2020 08:12:43 ISTUpdated On 25-08-20202020-08-24T02:58:10.526Z24-08-2020 2020-08-24T02:58:06.046Z - 2020-08-25T02:42:43.490Z - 25-08-2020

కాజల్ అగర్వాల్.. తెలుగులో సీనియర్ హీరోయిన్. ఇంచుమించు అందరు హీరోల సరసన నటించింది. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమె తన స్టామినా కొనసాగిస్తూనే వుంది. ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మూడు పదుల వయస్సు దాటినా ఈ అమ్మడి అందంతగ్గలేదు. చందమామ సినిమా తో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత విడుదల అయిన మగధీర సినిమా తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తెలుగు తమిళ మలయాళం మరియు కన్నడ భాషలలో బిజీగా మారిపోయింది. తెలుగులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినట్టుంది. వరుసగా వివాహాలు జరిగిపోతున్నాయి. నిఖిల్, నితిన్, రానా ఓ ఇంటివారయ్యారు. నాగబాబు తనయ నిహారికకు నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నాడు సుప్రీం హీరో సాయి థరమ్ తేజ. ఇప్పుడు కాజల్ వంతు వచ్చినట్టుంది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా తో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆమె పెళ్లి గురించి ఇటీవల కాలం లో అనేక వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన వార్త అభిమానుల్ని షాక్ కి గురి అయ్యేలా చేస్తోంది. అదేంటంటే కాజల్ కి ఏకంగా నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగిపోయిందట. అతి త్వరలోనే ఆమె పెళ్లి కూడా జరగబోతోంది. ఎప్పటి నుండో కాజల్ అగర్వాల్ ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేతని పెళ్లాడనుంది అని వార్తలు వస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే గౌతమ్ అనే బిజినెస్ మ్యాన్ తో ఇటీవలే ఆమెకి నిశ్చితార్థం జరిగిపోయిందిట. కుటుంబసభ్యులు పరిమితంగా దానికి హాజరయ్యారట. కాజల్ నుండి ఇప్పటీకి వరుకు ఎలాంటి సమాధానం రాలేదు. మరి ఆమె మౌనం అంగీకారమా లేదా అనేది ఖరారు కావాల్సి ఉంది. ఏది ఏమైనా కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా